సత్యసాయి : గత గరీబ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ బీమా నష్టపరిహారం ఇవ్వాలని టిడిపి సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు టిడిపి నేతలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముందుగా గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా సాగారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బికే.పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.










