ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు సిఐ గా సుబ్రమణ్యం బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ అనంతపురం వి ఆర్ కు బదిలీకాగా, నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యాన్ని పుట్లూరు సిఐ గా బదిలీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ... గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని మండల ప్రజలకు సూచించారు.










