Sep 06,2023 16:51
  •  విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ కె వి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో తాము ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచి లక్ష్యాన్ని చేరుకోవాలని డాక్టర్‌ కె.వి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చైర్మన్‌ డాక్టర్‌ పి వి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం నగర శివారులోని డాక్టర్‌ కె వి సుబ్బారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్‌ఎన్‌ డా.కె.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉంటు 90 శాతం అటెండెన్స్‌ కల్గి ఉండాలని తెలిపారు. కష్టపడి చదవాలని మీ తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ర్యాగింగ్‌ లేని కళాశాలగా మన కళాశాల రూపు దిద్దుకోవడం మనకు గర్వకారణం అన్నారు. కళాశాల కరెస్పాండెంట్‌ ఎస్‌.విజయలక్ష్మమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడితే కానీ విజయం చేరుకోలేమని ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కస్టపడి కాలాన్ని వృధా చేసుకోకుండా చదవాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జే కన్నా కుమార్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ తిరుపతి రెడ్డి ప్రొఫెసర్స్‌, ఫ్యాకల్టీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.