కదిరి (అనంతపురం) : విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కదిరిలో చోటుచేసుకుంది. కదిరి పట్టణం యర్రగుంటపల్లి జగనన్న కాలనీకి చెందిన రామకృష్ణ కుమారుడు ఆంజనేయులు కదిరి పాలిటెక్నికల్ కళాశాలలో ఆటోమొబైల్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు ఆంజనేయులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










