న్యూఢిల్లీ : నేపాల్‌లో వరుసగా రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటలకు, 2.51గంటల భూకంపాలు రాగా, రిక్టర్ స్కేలుపై భూప్రకంపనలు వరుసగా 4.6, 6.2గా నమోదయ్యాయి. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, హాపూర్, అమ్రోహాలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.










