అమరావతి : మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా .. చెల్లించలేదని.. ఎపి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని, మొత్తం 22948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు కౌలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు. నిధుల విడుదలకు జిఒ జారీ అయినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదని ఆరోపిస్తూ ... సిఆర్‌పిసి 166 ప్రకారం ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.










