ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఐవోఎస్ యాప్ కోసం కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. 'వాబీటాఇన్ఫో' నివేదిక ప్రకారం.. వాట్సాప్ యాప్‌లో స్టిక్కర్‌లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఐవోఎస్ 23.10.0.74 వెర్షన్ అప్‌డేట్ కోసం తాజా వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్‌ను గుర్తించారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, చాట్ షేర్ యాక్షన్ షీట్‌లో 'కొత్త స్టిక్కర్' ఎంపిక అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో వుంది కనుక ఎలా పని చేస్తుందనే వివరాల కోసం మరికొంత సమయం వేచి ఉండాల్సిందే.










