విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ... విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన పోరు బుధవారంతో 1000వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం విశాఖలోని కూర్మన్నపాలెం కూడలి వద్ద కార్మికులంతా నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డుగా నిలబడి 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలు చేశారు. వారికి పలు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన కార్మికులు, వివిధ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో రాజధాని పెట్టాలనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిఎం జగన్‌ను కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.










