Oct 04,2023 10:17

ముంబయి : మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్‌ వాంగ్మూలాన్ని మంగళవారం నమోదు చేశారు. మంగళవారం ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు ఎంపి హాజరయ్యారు. ఎంపికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నించి, ఎంపితో సహా మరో ఆరుగురి నిందితులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్‌ 29న జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రగ్యా ఠాకూర్‌తో పాటు లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌, మేజర్‌ (రిటైర్ట్‌) రమేష్‌ ఉపాధ్యారు, సమీర్‌ కులకర్ణి, అజరు రాహిర్‌కర్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది నిందితులుగా ఉన్నారు. సాక్ష్యాధారాలు ఆధారంగా వీరిని ప్రశ్నించారు. భోపాల్‌ ఎంపి అయిన ప్రగ్యా ఠాకూర్‌ ప్రతీ ప్రశ్నకు తనకు తెలియదు అని సమాధానం ఇచ్చారు.