- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ పిలుపు
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఈనెల 16, 17 తేదీల్లో కర్నూల్లో జరుగుతున్న రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వర్కర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కార్మిక కర్షక భవన్ సిఐటియు కార్యాలయం నందు ట్రాన్స్పోర్ట్ నిర్వహణ కమిటీ సమావేశం ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్ సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధాకృష్ణలు మాట్లాడుతూ.. రవాణారంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రవాణా రంగాన్ని ఆదుకోకపోగా అనేక రకాలుగా వేధింపులకు ఈ ప్రభుత్వాలు గురి చేస్తున్నాయన్నారు. జీవో నెంబర్ 21 ద్వారా రవాణా రంగం ప్రమాదంలో పడిందని ఓలా, ఉబర్, రాపిడ్ లాంటి ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా అవకాశాలు కల్పించడం వల్ల రవాణా రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేకమంది డ్రైవర్ల జీవితాలు అగమ్యాగోచరంగ తయారైందన్నారు. ప్రభుత్వాలు వేసే భారాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వర్క్ షాప్‌లో పై విషయాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమం నిర్వహించి.. ఆందోళన కార్యక్రమాల రూపొందిస్తామన్నారు. 16న ట్రాన్స్పోర్ట్ కార్మికుల మహా ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ న్యూ సిటీ కార్యదర్శి బి.రాధాకృష్ణ, ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు రవి, పి.మహమూద్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు రియాజ్ గంగాధర్, ఓల్డ్ సిటీ ఆటో యూనియన్ నాయకులు డి. కుమార్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.










