నెల్లూరు : ప్రతి ఏడాదీ రాష్ట్ర స్థాయి ఉత్తమ కవితా సంపుటాలకు పెన్నా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నామని నెల్లూరు పెన్నా రచయితల సంఘం నాయకులు అవ్వారు శ్రీధర్ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ కవితా సంపుటాలకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది సైతం సంవత్సరం పెన్నా సాహిత్య పురస్కారానికి తమ రచనలు పంపించాలని కోరతున్నామన్నారు.2022 జనవరి నుండి 2022 డిసెంబర్ వరకు ముద్రించిన కవితాసంపుటాలను మూడు కాపీలు చొప్పున పంపించాన్నారు. ఈ కవితా సంపుటాలను 31డిసెంబర్ 2023 లోగా పంపించాలన్నారు.పూర్తి వివరాలకు ఫోన్ - 8500130770 నంబరును సంప్రదించవచ్చన్నారు.










