భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు మండలంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న మనోజ్‌పై మండల వ్యవసాయ అధికారిణి (ఏవో) శిల్ప కత్తితో దాడి చేశారు. శుక్రవారం ఏవో కార్యాలయంలోనే వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం పరస్పరం వాదించుకుంటూనే కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరడంతో ఆగ్రహానికి లోనైన ఏవో శిల్ప మనోజ్‌పై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో మనోజ్ వీపు భాగంలో గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిల్పను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మనోజ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే మనోజ్‌పై శిల్ప దాడి చేసినట్లు తెలుస్తోంది.










