ప్రజాశక్తి- తిరుపతి: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి రెండు బ్రహ్మౌత్సవాలు విజయవంతమైనట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మౌత్సవాలు విజయవంతం చేశామని.. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వాహన సేవల ముందు కళ బృందాలు గొప్పగా తమ ప్రదర్శనలు చేశాయని, 15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు. ఉత్సవాలు ఘన విజయం కావడానికి శ్రమించిన ప్రతిఒక్కరికి చైర్మన్ అభినందనలు తెలియజేశారు.










