ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : మండలంలోని నేమకల్లు, నగర డోనా గ్రామాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆయా గ్రామాల పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పురస్కరించుకొని నేమకల్లు గ్రామంలో సర్పంచ్ ప్రేమ్ కుమార్, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బంగారమ్మ అవ్వ దేవాలయం దగ్గర ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్నదానం నిర్వహించారు.










