Jul 24,2023 21:58
  • శ్రీలంక 166ఆలౌట్‌.. పాకిస్తాన్‌తో రెండో, చివరి టెస్ట్‌

కొలంబో: రెండోటెస్ట్‌లో పాకిస్తాన్‌ జట్టు పట్టు బిగించింది. సోమవారం నుంచి ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆర్బార్‌ అహ్మద్‌(4/69), నసీమ్‌ షా(3/41), షాహిన్‌ షా అఫ్రిది(1/44) నిప్పులు చెరిగే తొలి ఇన్నింగ్స్‌లో 166పరుగులకే ఆలౌటైంది. ధనుంజయ(57), ఛండీమాల్‌(34), మెండీస్‌(27), కరుణరత్నే(17) రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 145పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫీక్‌(74నాటౌట్‌), మసూద్‌(51) అర్ధసెంచరీలతో రాణించగా.. క్రీజ్‌లో బాబర్‌ అజామ్‌(0) ఉన్నాడు. మరో ఓపెనర్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌(6) నిరాశపరిచాడు. ఫెర్నాండో, జయసూరియకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఇరుజట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్‌ డ్రా అయిన విషయం తెలిసిందే.