Aug 24,2023 12:33

ప్రజాశక్తి-కర్నూల్‌ స్పోర్ట్స్‌ : జిల్లాస్థాయి అంతర్‌ పాఠశాలల రబ్బి పోటీలలో ప్రభుత్వ ఉర్దూ బాలుర పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలు సాధించారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక డిఎస్‌ఏ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి రబ్బీ పోటీలలో ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలు పొందడం అభినందనీయమని పాఠశాల హెడ్మాస్టర్‌ ఎస్‌.పుష్పరాజ్‌ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో జరిగే జిల్లా స్థాయి పోటీలలో చక్కని క్రీడా ప్రతిభ పాటవాలు ప్రదర్శించి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ విజరు కుమార్‌ సీనియర్‌ ఉపాధ్యాయులు రెహానా బేగం, అబ్దుల్‌ సుకుర్‌, అస్లాం వలి, ఆసిఫా షాహీన, తాజుద్దీన్‌, జాకీర్‌ హుస్సేన్‌, షకీరా బేగం ,రవికుమార్‌ రెడ్డి, క్లాస్‌ టీచర్‌ షాజియా రఫ్ఫత్‌ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు