Sep 06,2023 15:14

ప్రజాశక్తి- దేవనకొండ(కర్నూలు) : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి మహేంద్ర నాయుడు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మియుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 77 సం,, గడుస్తూన్నప్పటికి మండలంలోని పలు గ్రామాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం కొన్ని గ్రామాల రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారని అయితే ఆ రహదారుల నిర్మాణాలు జరగకపోవడం విచారకరమన్నారు. తక్షణమే రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని డిమాండ్‌ చేశారు. పారిశుద్ధ్య లోపంతో గ్రామాల్లో మురుగు నీరు నిల్వఉండటం వల్ల ప్రజలు దోమలు బారిన పడి విష జ్వరలు వస్తూన్నయన్నారు. హంద్రీనీవా పెండింగ్‌ పిల్ల కాలువలు నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలన్నారు. 108 అంబులెన్స్‌ మండల కేంద్రములో లేక ప్రజలు ఆరోగ్యల నిమిత్తం ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ప్రసవాలు స్థానిక ప్రాథమిక ఆసుపత్రిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలను ,యువతను చైతన్య పరచి పోరాటాలుకు పిలుపునిస్తా మన్నారు.సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరహర దీక్ష కూడ చేయ్యల్సి వస్తూందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీనివాసులు, ఖాసీం, శ్రీరాములు, పరమేష్‌, బాబు, రవి, ఉపేంద్ర, హరి, మహేష్‌ పాల్గొన్నారు.