నెదర్లాండ్స్‌పై గెలుపుతో తొలిసారి సెమీస్‌కు
జపాన్‌కు స్వీడన్ ఝలక్
ఫిఫా మహిళల ప్రపంచకప్
సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లోకి స్పెయిన్, స్వీడన్ జట్లు దూసుకెళ్లాయి. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో స్వీడన్ జట్టు 2ా1గోల్స్ తేడాతో జపాన్‌పై, స్పెయిన్ జట్టు కూడా 2-1తోనే నెదర్లాండ్స్‌పై విజయం సాధించాయి. ఉదయం జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్ జట్టులోని లాారోజా గోల్‌చేసింది. ఈ టోర్నమెంట్‌లో రోజా ప్రాతినిధ్యం వహించిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో తొలి రెండు అర్ధభాగాల సమయం ముగిసేసరికి ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 30నిమిషాల అదనపు సమయానికి కేటాయించగా.. స్పెయిన్ జట్టు 2, నెదర్లాండ్స్ జట్టు ఒక్క గోల్‌ను చేశాయి. స్పెయిన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన గోల్‌ను తీనేజర్ సల్మా పరారుల్లే కొట్టింది. రెండో క్వార్టర్‌ఫైనల్లో స్వీడన్ తొలి అర్ధభాగంలో అమంద 32వ ని.లో గోల్ చేయడంతో 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో అర్ధభాగం 51వ ని.లో ఫుకా నగోన్స్ పెనాల్టీలో గోల్‌గా మలిచింది. దీంతో స్వీడన్ జట్టు 2ా0 ఆధిక్యతలో నిలిచింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు(86వ ని.) జపాన్ జట్టు ఒక గోల్ చేసింది. దీంతో స్వీడన్ జట్టు 5వసారి ఫిఫా ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జపాన్ ప్లేయర్స్ 11సార్లు కొట్టిన గోల్ టార్గెట్ బంతులను స్వీడన్ గోల్‌కీపర్ అద్భుతంగా నిలువరించింది. స్వీడన్ జట్టు 2003 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ కాగా.. మరో మూడుసార్లు మూడోస్థానంలో నిలిచింది. సెమీస్‌ను చేరే క్రమంలో స్వీడన్ జట్టు నాకౌట్ స్టేజ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను అమెరికాను, గ్రూప్ దశలో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఇక జపాన్ జట్టు 4ా0తో స్పెయిన్‌ను చిత్తుచేసి నాకౌట్‌కు చేరింది. జపాన్ జట్టు 2011లో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్నా.. ఈసారి క్వార్టర్‌ఫైనల్లోని నిష్క్రమించింది.
ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో నేడు..
ఆస్ట్రేలియా × ఫ్రాన్స్(మ.12.30గం||లకు)
ఇంగ్లండ్ × కొలంబియా(సా.4.00గం||లకు)










