Jul 28,2023 22:06

దేవధర్‌ ట్రోఫీ
పుదుచ్చేరి: దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన రౌండ్‌-3 లీగ్‌ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ జట్టు 9వికెట్ల తేడాతో నార్త్‌-ఈస్ట్‌-జోన్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌-ఈస్ట్‌-జోన్‌ బ్యాటర్స్‌ను సౌత్‌జోన్‌ బౌలర్లు సాయికిషోర్‌(3/22), కరియప్ప(3/27), రోహిత్‌ రాయుడు(1/8) దెబ్బకు 49.2ఓవర్లలో 136పరుగులకే కుప్పకూలింది. ప్రియజ్యోత్‌(40) టాప్‌స్కోరర్‌. ఛేదనలో సౌత్‌జోన్‌ జట్టు 19.3ఓవర్లలో మయాంక్‌ అగర్వాల్‌(32) వికెట్‌ కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్‌ రోహన్‌(87నాటౌట్‌), జగదీశన్‌(15నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపులో సౌత్‌జోన్‌ జట్టు 12పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇతర పోటీల్లో ఈస్ట్‌జోన్‌ జట్టు 88పరుగుల తేడాతో నార్త్‌జోన్‌పై, సెంట్రల్‌ జోన్‌ జట్టు వెస్ట్‌జోన్‌పై గెలిచాయి. ఆదివారం జరిగే నాల్గో లీగ్‌ మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ జట్టు సౌత్‌జోన్‌తో, సెంట్రల్‌ జోన్‌ జట్టు నార్త్‌-ఈస్ట్‌-జోన్‌తో, నార్త్‌జోన్‌ జట్టుావెస్ట్‌జోన్‌తో తలపడనున్నాయి.