- స్పందనలో కార్మిక సంఘాల వినతి పత్రం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్, రెగ్యులర్, ఎన్.ఎం .ఆర్, మలేరియా, కోవిడ్, గార్బేజ్ కార్మికుల ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కారించాలని, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు బండారు.ఎర్రిస్వామి,సిఐటియు అనంతపురం ఓల్డ్ టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో సూపరిండెంట్ ఇంజనీర్ నాగమోహన్ కు వినతిపత్రం అందచేశారు. అనంతరం సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికులకు 2011 వ సంవత్సరంలో 11 నెలల ఈపీఎఫ్ బకాయి ఉందని, 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ద్వారా వచ్చే డెత్ బెనిఫిట్స్ వెంటనే ఇప్పించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ వేతనాలు అమలు చేస్తూ రిస్క్, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు 2021 వ సంవత్సరం జనవరి నెలలో 409 మంది కార్మికులకు హెల్త్ అలవెన్స్ బకాయి ఉందన్నారు. 2023వ సంవత్సరం ఏప్రిల్ నెలలో 409 మంది కార్మికులకు హెల్త్ అలవెన్స్ బకాయి ఉందని, రెగ్యులర్ కార్మికులకు బకాయి ఉందన్నారు. పెరిగిన నగర విస్తీర్ణం జనాభాకి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేపట్టవలసిన అవసరం వస్తుందని హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పందించి తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, న్యూ టౌన్ అధ్యక్షులు గురు రాజా , మున్సిపల్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి సాకే. తిరుమలేష్, సహాయ కార్యదర్శి బత్తల. ఆదినారాయణ సాకే. లక్ష్మీనారాయణ, ఎం.ఆదినారాయణ, నగర కమిటీ సభ్యులు బంగ్లా.రాఘవేంద్ర ప్రసాద్, నాగేంద్ర, హెచ్.నల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
,










