Jul 18,2023 21:00
  • 8వ ర్యాంక్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
  • ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 6వ స్థానానికి ఎగబాకింది. ఐసిసి మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మంధాన 704పాయింట్లతో ఒక స్థానానికి మెరుగుపరచుకొని 6వ స్థానంలో ఉండగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండు స్థానాలు దిగజారి 702పాయింట్లతో 8వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇక బౌలర్ల జాబితాలో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ 9వ స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. దీప్తి శర్మ 322రేటింగ్‌ పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా.. గైక్వాడ్‌ ఖాతాలో 611తపాయింట్లు ఉన్నాయి. శ్రీలంక కెప్టెన్‌ ఛమారి ఆటపట్టు 758పాయింట్లతో వన్డే బ్యాటర్స్‌ జాబితాలో కెరీర్‌ బెస్ట్‌ 3వ స్థానానికి చేరింది. బ్యాటర్ల జాబితాలో బెత్‌ మూనీ(ఆస్ట్రేలియా) 769పాయింట్లు, బౌలర్ల జాబితాలో సోఫీ ఎక్లేస్టోన్‌(ఇంగ్లండ్‌) 756పాయింట్లు, ఆల్‌రౌండర్ల జాబితాలో నటాలీ స్కీవర్‌ 403పాయింట్లు టాప్‌లో ఉన్నారు.