ఇడుపులపాయ: వైఎస్‌ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. సీఎం వాహనాన్ని ఆయన కాన్వాయ్ లోని మరో వాహనం ఢకొీట్టింది. దీంతో సీఎం జగన్ వాహనం దిగి వేరే వాహనంలో ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్లారు. కాన్వాయ్ లోని సీఎం వాహనం ముందున్న వాహనం వేగం తగ్గడంతో ఈ ప్రమాదం జరిగింది. వేముల మండల వైసిపి నేతలతో సమీక్ష అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో కడపకు సీఎం బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన విజయవాడ రానున్నారు.










