Nov 10,2023 10:58

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదాపడింది. ఈ విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సిఐడి ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. మరింత సమయం కావాలని కోరడంతో ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మొదట ఈ విచారణను ఈ నెల 22కి వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించగా, ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.