వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం తెలిసిందే. ఫ్లాట్ పిచ్ పై నిప్పులు చెరిగే బౌలింగ్ చేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ విండీస్ లోయరార్డర్ ను హడలెత్తించాడు. తన ప్రదర్శనపై సిరాజ్ సంతప్తి వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ''ఫ్లాట్ గా ఉన్న పిచ్ పై 5 వికెట్లు తీయడం చాలా కష్టం.. అయితే, ఫిట్‌గా ఉండడంతో మరింత మెరుగ్గా బౌలింగ్ చేయగలిగా.. బౌలర్లకు సహకరించని పిచ్‌లపై బౌలింగ్ చేయడాన్ని తాను సవాల్‌గా భావిస్తా'' అని వివరించాడు. తాను ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఫిట్ నెస్ ట్రైనరల్ సోహెమ్ దేశారు అని తెలిపాడు. తాను మ్యాచ్ కు తగిన విధంగా ఫిట్ గా ఉండేలా చూసుకునే బాధ్యత దేశారు దేనని సిరాజ్ పేర్కొన్నాడు. తాను విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం వెనుక అతడి శ్రమ కూడా ఉందని తెలిపాడు.










