హైదరాబాద్: సింగరేణి కార్మికులకు బోనస్ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.53లక్షల బోనస్ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు రూ.1.53లక్షల చొప్పున బోనస్ అందనుంది. ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు.










