Sep 19,2023 08:14

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద టిడిపి నేతలు మౌనదీక్ష చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌లో టిడిపి నేతలు నివాళులర్పించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఆ పార్టీ ఎంపిలు, మాజీ ఎంపిలు, పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్కడే మౌనదీక్ష చేపట్టారు.