Sep 05,2023 15:54
  •  మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడి

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నగరాభివృద్ధి అంటే రెండు రోడ్లు రెండు బ్రిడ్జిలు నిర్మించడం కాదని నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడమే అభివృద్ధి అని పేర్కొంటూ మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజలను మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేట్లను మూసివేసి ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శిలు రామిరెడ్డి, ఆర్‌ వి నాయుడు మాట్లాడుతూ.. తమ సమస్యలను కమిషనర్‌ ఇతర ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం పై పాలకవర్గం అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబించటం దారుణమన్నారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు వైఫల్యం చెందారన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర శివారు ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. నగరంలో ఉన్న ప్రజల పైన పన్నుల మీద పన్నులు వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పాలకులు నగర ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగం, టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. పత్రికలు, ప్రజలు విమర్శిస్తున్న ఒక్క అధికారిపై కూడా ఇప్పటిదాకా చర్య తీసుకున్న పాపాన పోలేదని తెలిపారు. మంత్రి తనయుడు సేవలో అధికారులు తరించి పోతున్నారన్నారు. ఉద్యోగులతో బలవంతంగా వసూళ్లు చేయడంపై ఉద్యోగ వర్గాల్లో సైతం అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తం అయినా ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
చెత్త పన్ను రద్దు చేయాలని, ఇంటి గుత్తులు తగ్గించాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, నగర విస్తీర్ణం అనుగునంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని, తిక్క రంగయ్య స్వామి గుడి నుంచి తపోవనం దారిని వెడల్పు చేసి బాగు చేయాలని, రిషిత స్కూల్‌ దగ్గర బ్రిడ్జిని నిర్మించాలని, పెండింగ్లో ఉన్న నడిమి వంక సేఫ్టీ వాల్‌ నిర్మించి వరదల నుండి కాపాడాలని, నడిమి వంక, మరువ వంక, పెద్ద వంక పూడికలు తీయాలని, టిడ్కో ఇళ్ళు వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర నుండి చెరువు కట్టమీద పోవు రోడ్డు బాగు చేయాలని, శ్రీ శ్రీ నగర్‌ లో రోడ్లు, కాలువలు నిర్మించాలని, మున్సిపల్‌ కార్మికులకు ఇళ్ల స్థలాలు చూపించాలని, కుక్కల బెడద నుండి, పందుల బెడద నుండి, పశువుల బెడద నుండి నగర ప్రజలను కాపాడాలని, దోమల బారిన పడకుండా ఫాగింగ్‌ చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు మున్సిపల్‌ కార్యాలయం ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమానికి కమిషనర్‌ గారు వచ్చి మీరిచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ముట్టడి కార్యక్రమాన్ని విరమించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు వి. సావిత్రి, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వెంకటనారాయణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్‌, ముత్తుజ, వలీ గోపాల్‌ ,బాలకష్ణ , నగర నాయకులు మసూద్‌, ప్రసాదు ,రాజు, గఫూర్‌, ఎన్టీఆర్‌ సీన, లక్ష్మీనారాయణ, ఓబులేసు, రామాంజినమ్మ, సురేంద్ర, వెంకటేశు, జీవ, తపోవనం రాజు, వరలక్ష్మి, డి వై ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ రెడ్డి, ప్రజానాట్యమండలి శ్రీనివాసులు, పుల్లన్న, ఆటో యూనియన్‌ నాయకులు శివ, ఆది, లతీఫ్‌ నాయకులు సుబహాన్‌, నారాయణస్వామి, కష్ణ, ఖాసిం పీర తదితరులు పాల్గొన్నారు.