Jul 18,2023 20:57

గాలే: శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌ జట్టు తొలిటెస్ట్‌లో ఆధిక్యత సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 312పరుగులు చేయగా.. పాకిస్తాన్‌ జట్టు 461పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్‌కు 149పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ జట్టును సౌద్‌ షకీల్‌(208) డబుల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. అఘ సల్మాన్‌(83) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో పాక్‌ జట్టు 121.2 ఓవర్లలో 461పరుగులకు ఆలౌటైంది. మెండీస్‌కు ఐదు, జయసూరియకు మూడు, ఫశ్రీర్నాండో, రజితకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 14పరుగులు చేసింది. మధుశంక(8), కెప్టెన్‌ కరుణరత్నే(6) క్రీజ్‌లో ఉన్నారు.