టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ స్థానంలో స్మతి మంధాన జట్టను నడిపించనుంది. ఈ క్రమంలో హర్మన్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశాడు. ''ఔట్ విషయంలో హర్మన్ చేసింది ఓవర్‌గా అనిపించింది.. అంత వైల్డ్‌గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్‌లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్‌కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్‌ప్రీత్ విషయంలో ఓవర్ అనిపించింది. ఔట్ విషయంలో అంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు.'' అని అఫ్రిది స్పష్టం చేశాడు.










