Oct 02,2023 12:51

లక్నో : కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్‌ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్‌ పార్క్‌కు వెళ్లింది. పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు ఆ జంటను వేధించారు. కాబోయే భర్త చెంపపై కొట్టారు. కోరిక తీర్చాలని ఆ మహిళను పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌ బలవంతం చేశాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టేందుకు ఒక పోలీస్‌ పది వేలు, మరో పోలీస్‌ ఏకంగా రూ.5.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఆ జంటను సుమారు మూడు గంటలపాటు వేధించారు. చివరకు ఆ మహిళ మొబైల్‌లోని పేటీఎం యాప్‌ నుంచి రూ.1,000 ట్రాన్స్‌పర్‌ చేసుకుని విడిచిపెట్టారు. ఆ తరువాత కూడా పోలీసులు ఆ మహిళను వేధించారు. సెప్టెంబర్‌ 19న రాకేష్‌ కుమార్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. తన కోరిక తీర్చాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఆ కాల్‌ను రికార్డ్‌ చేసింది. సెప్టెంబర్‌ 22న ఆ ముగ్గురు ఆమె ఇంటికి వెళ్లడంతో, ఆమె విసిగిపోయింది.