అమరావతి: ఏపీలో అన్నదాతల కష్టాలపై ఆదివారం టీడీపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పార్టీ నేతలకు నారా లోకేశ్ సూచించారు.










