గయానా: యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 150పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4 పరుగుల దూరంలో నిలిచి చేజేతులా ఓటమిపాలైంది. డెత్ ఓవర్ల వరకు ఓ నిలకడైన బ్యాటర్ క్రీజ్‌లో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా. బౌలర్లకు సహకరించే వెస్టిండీస్ పిచ్‌లపై పరుగులు రాబట్టడం కష్టమే అయినా.. ఓ ప్రధాన బ్యాటర్ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ స్కోర్ నమోదు చేయడం ఖాయం. టెస్ట్, వన్డే సిరీస్‌లను గెలిచామన్న ఊహల్లో ఉంటే మాత్రం ఈ సిరీస్ చేజారడం ఖాయం. వెస్టిండీస్ జట్టు ముఖ్యంగా టి20 ఫార్మాట్‌కు సరిపోయే జట్టది. ఇక తొలి టి20లో ఎదురైన ఓటమిని పక్కన పెట్టి టీమిండియా యువ క్రికెటర్లు జాగ్రత్తగా ఆడాల్సి అవసరమెంతైనా ఉంది. టెస్టుల్లో రాణించిన జైస్వాల్‌కు టి20ల్లో చోటు దక్కపోవడం, శుభ్‌మన్, ఇషాన్ తొలి టి20లో నిరాశపరచడం తొలి టి20లో ఓటమికి ప్రధాన కారణాలని చెప్పుకొవచ్చు.
జట్లు (అంచనా):
భారత్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
విండీస్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కేల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ ఛార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్‌మయెర్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, ఒషానె థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్










