కొలంబో : శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండోటెస్ట్ రెండోరోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రెండోరోజు ఆటకు దిగిన పాకిస్తాన్ జట్టు కొద్దిసేపు బ్యాటింగ్ చేసిన అనంతరం భారీగా వర్షం కురిసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్తాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో షఫీక్(87), బాబర్(28) ఉన్నారు. దీంతో పాకిస్తాన్‌కు 12పరుగుల ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 166పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.










