ప్రజాశక్తి-కర్నూలుస్పోర్ట్స్ : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు 12 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించినట్లు ఉషూ సంఘం జిల్లా చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో శంకర్ మాట్లాడుతూ.. చిన్నారులు చదువుతోపాటు కరాటే ఉషూ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యం కొరకు ఆత్మ రక్షణ కొరకు తోడ్పపడుతుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలో పథకాలు సాధించినందుకు క్రీడాకారులకు అభినందించారు. అనంతరం పథకాలు సాధించిన క్రీడాకారులకు పథకాలు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి.శ్రీనివసులు, ప్రభుత్వ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ మౌలాలి, మాస్టర్లు క్రాంతి పాల్గొన్నారు.










