- ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థికశాఖ లేఖలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పలు ప్రాజెక్టుల కోసం తీసుకురటున్న రుణాలను రాష్ట్రాలు పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తున్నాయా లేదా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మొత్తాలను రాష్ట్రాలు ఇతర పథకాల కోసం మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రుణాల వినియోగంపై ఆరా తీస్తూ కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్ట్రాలకు లేఖలు రాసింది. ఈ లేఖల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించి 50 ప్రాజెక్టులను కేంద్ర ఆర్థికశాఖ ప్రస్తావించగా, వాటిలో రాష్ట్రానికి చెందిన విశాఖ -చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా ఉంది. దీంతో ఈ విషయం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2021వ సంవత్సరం నుండి తాము ఈ ప్రాజెక్టుల రుణాలసై వివరాలు కోరుతున్నామని, అయినా రాష్ట్రాలు స్పందించడం లేదని ఈ లేఖల్లో కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులతో రుణాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రుణ నిధులను బ్యారకు ఖాతాల్లో నిల్వ ఉరచడం వల్ల కొరత ఆదా జరుగుతురది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు తమ వాటా నిధులు భరిరచలేక రుణాలను రద్దు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తమకు ఈ వివరాలు సమర్పిరచడం లేదన్నది కేంద్ర ఆర్థికశాఖ వాదనగా ఉరది. అరదుకే రుణాలను ఖాతాల్లో నిల్వ చేయడం వల్ల ఎరత నిధులు ఆదా అయ్యాయన్నది చెప్పాలని కేంద్రం డిమారడ్ చేస్తోరది. గతంలో ఇలా ఆదా అయిన నిధులను కేంద్రానికి సమర్పిరచాలని కూడా లేఖలు వచ్చారు. అయితే, ఈ దిశలో రాష్ట్రాల స్పందన నామమాత్రమని సమాచారం.










