Jul 23,2023 14:39

భారత స్టార్‌ డబుల్స్‌ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్‌ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్‌పయాన్‌-ముహమ్మద్‌ రియాన్‌ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి ఫుంజుకున్న సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి ప్రత్యర్థిని ఓడించి చాంపియన్స్‌గా నిలిచారు. ఇదివరకు థాయిలాండ్ ఓపెన్ (2019), ఇండియా ఓపెన్ (2022) గెలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన అతను ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.