Jul 26,2023 16:07

కొరియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్‌ స్టార్‌ షట్లర్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ జోడి జపాన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్‌ మార్టిన్‌ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.

 

ప్రీక్వార్టర్స్‌లోకి లక్ష్యసేన్‌

కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్‌పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. అంతకముందు జరిగిన కెనడా ఓపెన్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.