కొరియా ఓపెన్ సూపర్300
సియోల్: కొరియా ఓపెన్ సూపర్300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జోడీ హవా కొనసాగుతోంది. 3వ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిాచిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీలో చిరాగ్-సాత్విక్ 21-14, 21-17తో 5వ సీడ్ జపాన్‌కు చెందిన టకురో హోకీాయుకో కొబయాషీపై వరుససెట్లలో గెలిచారు. ఈ మ్యాచ్‌ను భారత షట్లర్ల బృందం కేవలం 40నిమిషాల్లోనే ముగించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన భారత జోడీ.. రెండో గేమ్‌లో ఓ దశలో 16-13 ఆధిక్యతలో నిలిచారు. ఆ తర్వాత జపాన్ జోడీ రాణించి 16-16పాయింట్లతో సమం చేయగా.. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి సాత్విక్-చిరాగ్ జోడీ మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ చైనాకు చెందిన 2వ సీడ్ లియాంగ్ వురు-వాంగ్ ఛాంగ్‌తో తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్ సెమీస్‌కు ఆంటోన్సెన్(డన్మార్క్)-3వ సీడ్ షీ యుాక్యూ(చైనా), టాప్‌సీడ్ నరోకా(జపాన్), 4వ సీడ్ లో కెన్ యు(సింగపూర్) ప్రవేశించారు. ఇక మహిళల సింగిల్స్ సెమీస్‌కు చెన్ యుఫీ(చైనా), సన్-యే యంగ్(కొరియా), యమగుచి(జపాన్), తైజుాయింగ్(తైపీ) ప్రవేశించారు.










