ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. టికెట్లు కావాలనుకునే వాళ్లువెబ్ సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బిసిసిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 15మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభమైందని.. టికెట్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు (https://cricketworldcup.com/register) వెబ్‌సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల 25 నుంచి టికెట్లు కొనుగోలు చేసే వీలుంటుంది.
ఆగస్టు 25- భారత జట్టు మినహా... ఇతర అన్ని జట్లు ఆడే వార్మప్ మ్యాచ్ లు, ఇతర అన్ని జట్ల వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
ఆగస్టు 30- గువాహటి, త్రివేండ్రం స్టేడియంలలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
ఆగస్టు 31- చెన్నై, ఢిల్లీ, పూణే నగరాల్లో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 1- ముంబయి, లక్నో, ధర్మశాలలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 2- బెంగళూరు, కోల్ కతాలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 3- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 15- వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు










