ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్ :కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా ఎస్పీ జి. కఅష్ణకాంత్ బుధవారం తనిఖీ చేసి భద్రత ఏర్పాట్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవిఎం గోడౌన్ పరిసర ప్రాంతంలోకి అనుమతి లేనిదే ఎవ్వరినీ అనుమతించరాదని సంబంధిత పోలీసు అధికారులకు, విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ పాల్గొన్నారు.










