ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఈ నెల 25 నుండి దేహదారుడ్య) పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ సంధర్బంగా శనివారం కర్నూలు ఎపిఎస్‌పి 2వ బెటాలియన్‌లో జిల్లా ఎస్‌పి జి.కృష్ణ కాంత్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేసి దిశా నిర్దేశం చేశారు. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేహాదారుడ్యు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలని జిల్లా ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి అడ్మిన్ టి.సర్కార్, ఎఆర్ అడిషనల్ ఎస్‌పి జి.నాగబాబు, డిఎస్‌పిలు విజయ శేఖర్, యుగంధర్ బాబు, కృష్ణమోహన్, రవికిరణ్, డిపిఓ ఏవో సురేష్ బాబు, సిఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.










