అమరావతి (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఈరోజు ఉదయం అమరావతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలైనవారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. నలుగురు మృతులు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు. బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టీ)కి చెందినవారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.










