నేటి నుంచి పప్పు సెనగ సబ్సిడీ విత్తనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం : ఏవో రవికుమార్
ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మద్దికేర మండలంలో ఉన్న రైతులందరికీ సబ్సిడీ విత్తనాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్నట్లు వ్యవసాయ అధికారి రవికుమార్ తెలిపారు. సబ్సిడీ కావలసిన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో వారి ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో పప్పు శనగలు పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్కు సెల్ ఫోను తీసుకొని నమోదు చేయించుకోవాలని కోరారు. 2023 ఖరీఫ్ లో పంట నమోదు చేసుకున్న రైతులు 28 తారీకు లోపల ఈకేవైసి చేయించుకోవాలని తెలియజేశారు. ఒక కింటం శనగ ధర 800 రూపాయలు రైతులు చెల్లించవలసిన ధర 4860 రూపాయలు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ ధర 3240 అని తెలిపారు.










