ఢిల్లీ : దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి ధరను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028కు తగ్గింది. తగ్గించిన ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. కాగా గత నెలలో వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50, డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 మేరకు పెంచిన విషయం తెలిసిందే.










