సిద్దిపేట: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగానికి బుధవారం అంకురార్పణ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి నుంచి ప్రత్యేకంగా హాజరైన పండితులు మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహించనున్నారు.రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివఅద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని తలపెట్టారని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీశారదాపీఠానికి ప్రత్యేకమని స్పష్టం చేశారు.










