Sep 21,2023 15:53

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తారు. నేడు ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వేస్టేషన్‌ను రాహల్‌ సందర్శించారు. స్టేషన్‌లో ఉన్న రైల్వే కూలీలతో రాహుల్‌ ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌ రైల్వే కూలీలాగా ఎర్రటిచొక్కా వేసుకుని, బ్యాడ్జీ ధరించి, మూటలు మోశారు. దీంతో అక్కడున్న రైల్వే కూలీలంతా రాహుల్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోకు జతగా.. భారత్‌ జోడో యాత్ర నడుస్తుంది అని జోడించింది.
ఈ వీడియోను యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. రాహుల్‌ 'ప్రజానాయకుడు' అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.