Jul 28,2023 22:18

హాంగ్జో: ఆసియా క్రీడలు ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయమున్నప్పటికీ.. భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి. ఆసియాకు చెందిన టాప్‌-4లోని జట్లకు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు ఎంట్రీ లభించింది. భారత్‌తో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లకు కూడా క్వార్టర్స్‌ బెర్తు దక్కింది. భారత పురుషుల మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 7వరకు, మహిళల మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19నుంచి 26వరకు జరుగుతాయి. పురుషుల విభాగంలో మొత్తం 18 జట్లు పోటీ పడనుండగా, మహిళల విభాగంలో 14 జట్లు పతకాలకు పోటీ పడనున్నాయి. టైటిల్‌ కోసం తలపడనున్నాయి. చైనాలోని హంగ్జోలో ఉన్న జీజియాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ క్రికెట్‌ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత క్రికెట్‌ రెండు జట్లు ఆసియా గేమ్స్‌లో పాల్గనడం ఇదే మొదటిసారి. 2010, 2014లో క్రికెట్‌ను అనుమతించినప్పటికీ బిసిసిఐ మాత్రం మన జట్టును పంపలేదు.