Jun 03,2023 13:01

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : మద్దతు ధరకు పసుపు కొనుగోలును ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని కలవకూరులోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ... పసుపు సాగు చేసిన రైతులకు పంట అమ్ముకోవడానికి ఆయా రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఒక్కొక్క రైతుకి గరిష్టంగా 30 క్వింటా లు కొనుగోలు చేస్తారని, క్వింటాలు ఒక్కింటికి 6,850 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రంలోని సిబ్బంది, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.