Oct 29,2023 15:20

విజయవాడ: ఢిల్లీలో నిర్మాణం చేపట్టబోయే అమఅతవనంలో భాగస్వామ్యం అయ్యేలా బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మట్టిని సేకరించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 900 మట్టి కలశాలను ఆదివారం ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి ఢిల్లీకి పంపారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలును బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మట్టి కలశాలను శోభయాత్రగా రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు పురందేశ్వరి విముఖత చూపించారు.