Aug 29,2023 15:43

ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : మండల పరిధిలోని తెర్నేకల్‌ గ్రామంలో మంగళవారం గ్రామస్తులు వర్షం కోసం పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ మొగతాల్‌ అరుణ్‌ కుమార్‌ గ్రామస్తులతో కలిసి ఎల్లమ్మ పేటలోని ఎల్లమ్మ గుడి, ఎస్సీ కాలనీలోని మారెమ్మ దేవాలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చలువ కుండల్లో నైవేద్యాన్ని మహిళలు నెత్తిన పెట్టుకుని పురవీధుల గుండా మేళతాళాలతో వెళ్లి అమ్మవార్లకు సమర్పించి అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజర్లు వడ్డె లక్షుమన్న, వడ్డె బతకన్నా, పోస్టల్‌ మునిస్వామి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మధు, వైసిపి నాయకులు లింగన్న, యేసేపు, నాగన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.